![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 1109 లో... ఇందు, నందు ఆ లొకేషన్‌కు వస్తుండగా.. శశి మాత్రం ఐశ్వర్యను మోసం చేయడానికి ప్లాన్ చేస్తాడు. రోజా పువ్వు ఇచ్చి మోకాళ్లపై కూర్చుని.. నువ్వంటే నాకు ప్రాణం.. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను.. నువ్వు లేక నేను లేను.. ఐ లవ్యూ అంటూ చెప్తాడు. ఐశ్వర్య కూడా “ఐ లవ్యూ యూ” అని చెప్పడంతో శశి ప్లాన్ సక్సెస్ అయినట్టే అనుకుంటాడు. ఆ తర్వాత మత్తు మందు కలిపిన డ్రింక్‌ను ఐశ్వర్యకు ఇస్తాడు. అది తాగిన వెంటనే ఐశ్వర్య మత్తులోకి వెళ్తుంది. ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నానంటూ శశి ఆమెను తన గదిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు.
ఇంతలో ఇందు, నందు ఇంట్లోకి వచ్చి ఐశ్వర్య కోసం వెతుకుతారు. శశి ఐశ్వర్యపై చేయి వేయబోతుండగా ఇందు అడ్డుకుని.. నువ్వు ఇలాంటి వాడివేనని ముందే చెప్పాను.. కానీ నువ్వు నమ్మలేదంటూ శశిని కొడుతుంది. శశి ఎదురుదాడికి ప్రయత్నించగా నందు.. వన్ ప్లస్ టూ ఏమీ వద్దా అంటూ ఎంట్రీ ఇస్తుంది. నువ్వు ఐశ్వర్యను తీసుకెళ్లు అక్కా.. వీడి సంగతి నేను చూసుకుంటానని నందు అంటుంది. శశిని నందు చితక్కొట్టి, బయట ఉన్న రౌడీలను కూడా కొడుతుంది. చివరకు ఇందు, నందు కలిసి ఐశ్వర్యను అక్కడి నుంచి కాపాడుకుని ఇంటికి తీసుకొస్తారు.
మరుసటి ఉదయం ఐశ్వర్యకు ఏం జరిగిందో గుర్తుండదు. ఏం జరిగింది.. అందరూ ఎందుకు అలా చూస్తున్నారని ఐశ్వర్య అడుగుతుంది. ఇందు, నందు రాత్రి శశి చేసిన మోసం గురించి చెప్పినా.. నేను నమ్మను.. నేను శశిని ప్రేమిస్తున్నాను.. నా కలల్ని నాశనం చేశారంటూ ఐశ్వర్య వారిపైనే కోప్పడుతుంది. మీరంతా నాకు పరాయి వాళ్లు.. నా ఫ్రెండ్స్‌నే సొంత వాళ్లు అని ఐశ్వర్య తేల్చి చెప్తుంది. దీంతో నందు ఐశ్వర్య ఫ్రెండ్ రేణును తీసుకొచ్చి.. ఇప్పుడు నిజం చెప్పు.. శశి గురించి పిన్ టు పిన్ చెప్పు అని అడుగుతుంది. వాడు మంచి వాడు కాదు. వాడు ఇచ్చే ఖరీదైన గిఫ్ట్స్ కోసం మాత్రమే నేను అతన్ని మంచివాడని చెప్పానని నిజం చెప్పడంతో ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |